ఈ కాంబో మూవీ హీరోయిన్ ఎవరు?

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యాన్స్‌కు ఏదో గ్రాండ్ జరగబోతోందని ఫీలింగ్ వస్తుంది. ఈ కాంబో నెక్స్ట్ ఏం తీస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ ఎంపికలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి వంటి పేర్లు వినిపించాయి. కానీ, ఇప్పుడు అధికారికంగా శ్రీనిధి శెట్టి ఫైనల్ అయ్యింది. ఈ కన్నడ బ్యూటీ తన చార్మ్, ఎనర్జీతో సినిమాకు మరింత గ్లామర్ తీసుకొస్తోంది.
ఇక టైటిల్ విషయానికొస్తే .. ‘అలివేలు వెంకటరత్నం, వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే ఆప్షన్స్ ఉన్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.ఈ సినిమాను సూర్యదేవర చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో, వెంకీ లీడ్‌లో ఈ మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
సెట్స్, షెడ్యూల్స్, ప్రిపరేషన్స్ అన్నీ ఫాస్ట్‌గా జరుగుతూ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మరింత ఎక్సైట్‌మెంట్ యాడ్ చేస్తూ.. త్రివిక్రమ్ రెగ్యులర్ మ్యూజిక్ పార్టనర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ కూడా బిగ్ హిట్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, షార్ప్ డైలాగ్స్‌తో ఈ సినిమా ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.
-
Home
-
Menu