త్వరలోనే నా సొంత గొంతుతో డబ్బింగ్ చెబుతాను : శ్రీనిధి శెట్టి

త్వరలోనే నా సొంత గొంతుతో డబ్బింగ్ చెబుతాను : శ్రీనిధి శెట్టి
X
నేను సంతకం చేసిన మొదటి తెలుగు చిత్రం వాస్తవానికి 'తెలుసు కదా'. ఆ తర్వాత వెంటనే నా భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ప్రారంభించాను.

కన్నడ హీరోయిన్స్ టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవడం అనేది కొత్త పోకడ ఏమీ కాదు. సుమలత, సౌందర్య నుంచి రష్మిక మందన్న వరకు.. టాలీవుడ్ కర్ణాటకకు చెందిన చాలా మంది ప్రముఖ నటీమణులను ఆదరించింది. ఇప్పుడు, శ్రీనిధి శెట్టి కూడా ఇక్కడ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేజీఎఫ్ నటి ఇప్పటికే "హిట్ 3" లో నటించింది. ఇప్పుడు తన రాబోయే చిత్రం "తెలుసు కదా" చిత్రంలో నటిస్తోంది. దీని ప్రచారాన్ని షురూ చేసింది.

శ్రీనిధి శెట్టి తెలుగు భాష గురించి మాట్లాడుతూ.. "నేను కాలేజీ రోజుల్లోనే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు చాలా మంది తెలుగు స్నేహితులు ఉన్నారు. 'హిట్ 3' ముందుగా విడుదల అయినప్పటికీ, నేను సంతకం చేసిన మొదటి తెలుగు చిత్రం వాస్తవానికి 'తెలుసు కదా'. ఆ తర్వాత వెంటనే నా భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ప్రారంభించాను. త్వరలోనే నా సొంత గొంతుతో తెలుగులో డబ్బింగ్ చెప్పాలని చూస్తున్నాను’’ అని తెలిపింది.

ఈ చిత్రంలో ఆమె సిద్ధు జొన్నలగడ్డ సరసన కథానాయికలలో ఒకరిగా నటిస్తోంది. "తెలుసు కదా’’ అనేది బేసిగ్గా ఒక ప్రేమకథ. కానీ ఇందులో దానికి సంబంధించిన సర్ ప్రైజెస్ చాలానే ఉన్నాయి. ఇది తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది" అని శ్రీనిధి శెట్టి తెలపింది.

Tags

Next Story