సోషల్ మీడియాలో దూసుకుపోతున్న శ్రీలీల !

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న శ్రీలీల !
X

టాలీవుడ్ అందాల హీరోయిన్ .. శ్రీలీల క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతూ వెళ్తోంది. ఈ మధ్యకాలంలో ఆమెకి ఎలాంటి భారీ హిట్ సినిమాలు లేకపోయినా, "పుష్ప 2"లో చేసిన ఐటమ్ సాంగ్ వల్ల ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత శ్రీలీల తన సోషల్ మీడియా ప్రొఫైల్‌ను మెరుగుపర్చే పనిలో నిమగ్నమైంది. ఆ ప్రయత్నాల ఫలితంగా కేవలం ఆరు నెలల్లోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల ఫాలోవర్ల పెరుగుదల ఈ విధంగా ఉంది. సెప్టెంబర్ 2024.. 6 మిలియన్ ఫాలోవర్లు. డిసెంబర్ 2024.. 9 మిలియన్ ఫాలోవర్లు. మార్చి 1, 2025.. 11 మిలియన్ ఫాలోవర్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల మార్క్‌ను అధిగమించి.. శ్రీలీల ఇప్పుడు తెలుగు సినీ తారల్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారి జాబితాలో చేరిపోయింది.

శ్రీలీల నటించిన "రాబిన్‌హుడ్" సినిమా మార్చి 28న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, ఆమె తన మొదటి హిందీ చిత్రం "ఆశికి 3" షూటింగ్‌లో పాల్గొంటోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే "మాస్ జాతర" అనే సినిమాతో రవితేజ సరసన ఆమె నటిస్తోంది.

"పుష్ప 2"లో శ్రీలీల చేసిన "కిస్సిక్" సాంగ్ బాలీవుడ్ యూత్‌లో విపరీతమైన ఆదరణ పొందింది. దీనివల్ల ఆమెకి హిందీ చిత్రసీమ నుంచి భారీ స్థాయిలో ఆఫర్లు రావడం మొదలైంది. ఈ పాట ప్రభావంతో ఉత్తర భారతదేశ యువత ఆమెను ఎక్కువగా ఫాలో అవుతూ, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. శ్రీలీల క్రేజ్ ఇలాగే కొనసాగితే.. ఆమె త్వరలోనే టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఒక స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలున్నాయి!

Tags

Next Story