శ్రీలీల స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?

శ్రీలీల స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
X
ఇప్పటి వరకు గ్లామర్, డ్యాన్స్‌ ప్రధానమైన పాత్రలకే పరిమితమై పోతున్నట్లు వచ్చిన ముద్రను చెరిపేసేందుకు, ఆమె కొత్త సినిమాల్లో నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదిరే డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల. అయితే ఇకపై కేవలం డ్యాన్స్ నంబర్లకు మాత్రమే పరిమితం కాకుండా నటనా పరంగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు గ్లామర్, డ్యాన్స్‌ ప్రధానమైన పాత్రలకే పరిమితమై పోతున్నట్లు వచ్చిన ముద్రను చెరిపేసేందుకు, ఆమె కొత్త సినిమాల్లో నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.

అందులో భాగంగా నితిన్ సరసన నటిస్తున్న "రాబిన్‌హుడ్" చిత్రంలో శ్రీలీల నీరా వాసుదేవ్ అనే ధనిక కుటుంబానికి చెందిన, ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళగా కనిపించనుంది. విదేశాల నుంచి భారత్‌కి తిరిగి వచ్చే ఆమె, ఓ సెక్యూరిటీ ఏజెన్సీని అద్దెకు తీసుకుంటుంది. ఈ క్రమంలో నితిన్ పాత్రతో ఆమెకున్న సంబంధం, సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయి. ఈ పాత్ర ద్వారా శ్రీలీల తన అభినయ పరంగా కొత్త కోణాన్ని చూపించేందుకు ఆసక్తిగా ఉంది.

ఇండస్ట్రీలో తనపై ఉన్న స్టీరియోటైప్‌ని మార్చే ప్రయత్నంలో భాగంగా, తన కొత్త పాత్రపై శ్రీలీల ఉత్సాహం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ, "బలమైన, బహుముఖమైన పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘రాబిన్‌హుడ్’ లోని నా పాత్ర నాకు ఎంతో కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది" అని చెప్పింది.

శ్రీలీల కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోయే ఈ చిత్రం 2025 లో ఆమె తొలి విడుదల కానుంది. దీనికి తోడు, బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్ సరసన ‘ఆశికి 3’, రవితేజతో కలిసి ‘మాస్ జాతర’ చిత్రాలు చేస్తోంది. ‘మాస్ జాతర’ ఈ ఏడాది విడుదల కానుండగా, ‘రాబిన్‌హుడ్’ 2025 మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రాబిన్‌హుడ్’ శ్రీలీల కెరీర్‌లో మరో కీలకమైన సినిమా కానుంది. ఈ సినిమాతో ఆమె కేవలం డ్యాన్సర్ మాత్రమే కాకుండా, శక్తివంతమైన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

Tags

Next Story