సైజ్ జీరో లుక్ కోసం కసరత్తులు

టాలీవుడ్ అందాల హీరోయిన్ శ్రీలీల.. తన అద్భుతమైన సౌత్ ఇండియన్ గర్ల్-నెక్స్ట్-డోర్ పాత్రలకు పేరొందిన బ్యూటీ. ఇటీవల ఆమె కొన్ని నెలల్లో గుర్తించదగ్గ రీతిలో సన్నగా మారింది. బాలీవుడ్‌పై దృష్టి సారించిన ఈ అమ్మడు.. స్లిమ్ ఫిజిక్ సాధించేందుకు కష్టపడుతోంది. ఇండస్ట్రీలో జరిగే చర్చల ప్రకారం, ఆమె దాదాపు సైజ్-జీరో లుక్‌ను టార్గెట్ చేస్తుందని సమాచారం.
బాలీవుడ్‌లో సైజ్-జీరో ట్రెండ్ ఇప్పుడు తగ్గినప్పటికీ, సన్నగా, టోన్డ్ బాడీకి ప్రాధాన్యత కొనసాగుతోంది. బాలీవుడ్ డెబ్యూకి సిద్ధమవుతున్న శ్రీలీల ఈ లక్షణాలకు సరిపోయేలా తీర్చిదిద్దుకుంటుంది. ఆమె ఇప్పటికే అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన తన తొలి హిందీ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తి చేసింది. ఈ చిత్రాన్ని మొదట దీపావళి 2025కి రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు 2026 వేసవికి వాయిదా పడింది. అంతేకాదు, ఆమె మరో రెండు పెద్ద హిందీ ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతోంది.
బాలీవుడ్‌తో పాటు.. శ్రీలీల రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో ఒకటి శివ కార్తికేయన్ నటిస్తున్న “పరాశక్తి”. 2026 సంక్రాంతికి విడుదల కానుంది. తెలుగులో ఆమె “మాస్ జాతర” అండ్ “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలను చేస్తోంది. తన పెరుగుతున్న క్రేజ్‌కి తగ్గట్టు, శ్రీలీల మల్టిపుల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ సైన్ చేస్తోంది. పాన్-ఇండియా క్రేజ్ కొనసాగించడానికి, ఆమె తన కొత్తగా మారిన స్లిమ్ ఫిజిక్‌ను నిలబెట్టుకోవడానికి కష్టపడుతోందని సమాచారం.
-
Home
-
Menu