శ్రీవిష్ణు బ్యాక్-టు-బ్యాక్ సినిమాల హంగామా!

శ్రీవిష్ణు బ్యాక్-టు-బ్యాక్ సినిమాల హంగామా!
X

వైవిధ్యభరిత పాత్రలతో టాలీవుడ్ లో డీసెంట్ హిట్స్ అందుకుంటున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న 'సింగిల్' ఒకటి. 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్సెస్ తో 'సింగిల్'పై అంచనాలు పెరిగాయి.

హుస్సేన్‌ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మృత్యుంజయ్'లో మరో విభిన్న గెటప్ లో కనిపించబోతున్నాడు శ్రీవిష్ణు. ఈ చిత్రంలో రెబా జాన్ కథానాయికగా నటిస్తుంది 'సామజవరగమణ' తర్వాత శ్రీవిష్ణు-రెబా కాంబోలో వస్తోన్న మూవీ ఇది. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.

శ్రీవిష్ణు మరో చిత్రానికి యదునాథ్‌ మారుతీరావు దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. 'క్రేజీ రైడ్‌ కోసం రండి – బ్రేక్స్ లేవు.. నవ్వులు మాత్రమే!' అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా పూర్తిగా వినోదభరితంగా ఉండబోతుందట. ఒంగోలు పట్టణం నేపథ్యంగా ఈ సినిమా సాగనుంది.

Tags

Next Story