‘స్పిరిట్’ మూవీ లాంచింగ్ ఎప్పుడంటే.. !

‘స్పిరిట్’ మూవీ లాంచింగ్ ఎప్పుడంటే.. !
X
వచ్చే నెలలో ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమంతో లాంఛ్ కానుంది. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో “స్పిరిట్” సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్. వచ్చే నెలలో ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమంతో లాంఛ్ కానుంది. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ప్రభాస్ షెడ్యూల్‌ని బట్టి, సందీప్ వంగా ఇతర నటీనటులతో లేదా నేరుగా ప్రభాస్‌తో షూటింగ్ మొదలు పెడతాడు. ప్రభాస్ 2026 జనవరి నుంచి “స్పిరిట్” కోసం పూర్తిగా డెడికేట్ అవుతానని చెప్పాడు. అప్పటివరకు అతడు “ది రాజా సాబ్” అండ్ “ఫౌజీ” సినిమాల షూటింగ్‌ని పూర్తి చేస్తాడు. విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), షాహిద్ కపూర్ (కబీర్ సింగ్), రణబీర్ కపూర్ (అనిమల్) వంటి నటుల నుంచి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లను రాబట్టిన సందీప్ వంగా.. ఈ సినిమాలో ప్రభాస్‌లో కొత్త డైమెన్షన్‌ని తీసుకొస్తానని డిటర్మైన్డ్‌గా ఉన్నాడు.

ప్రభాస్ పూర్తి ఫోకస్‌ని ఈ ప్రాజెక్ట్‌పై ఉంచాలని వంగా కోరు కుంటున్నాడు. “స్పిరిట్” ఒక హై-ఆక్టేన్ క్రైమ్ డ్రామా. గ్లోబల్ మాఫియా అండ్ డ్రగ్ కార్టెల్స్ డార్క్ వరల్డ్‌లో సెట్ చేయబడింది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. అతని లవ్ ఇంట్రెస్ట్‌గా త్రిప్తి దిమ్రి నటిస్తుండగా, కొరియన్ స్టార్ డాన్ లీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సందీప్ వంగా ఓన్ ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్, బాలీవుడ్ జెయింట్ టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. “స్పిరిట్” సినిమా షూటింగ్ వివిధ అంతర్జాతీయ లొకేషన్స్‌లో జరగనుంది.

Tags

Next Story