వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూటింగ్!

వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూటింగ్!‘విరూపాక్ష, బ్రో’ విజయాల తరువాత, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో రాబోతున్నాడు. సాయితేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘హనుమాన్’ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ₹125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో సాయి దుర్గ తేజ్ ఓ పవర్‌ఫుల్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి ఈ సినిమాలో సాయి క్యారెక్టర్‌ను లార్జర్ దెన్ లైఫ్ మేనర్‌లో ప్రజెంట్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘కార్నేజ్’ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సారథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు.
లేటెస్ట్ గా దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో 1,000 మంది డ్యాన్సర్స్‌తో ‘సంబరాల ఏటిగట్టు‘ కోసం ఓ గ్రాండ్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న పాట ఇదేనని ఫిల్మ్ నగర్ టాక్. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ‘సంబరాల ఏటిగట్టు‘ విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu