ధన పిశాచిగా సోనాక్షి సిన్హా!

తన మొట్టమొదటి ఫుల్-ఫ్లెడ్జ్‌డ్ తెలుగు రోల్‌లో.. హీరోయిన్ సోనాక్షి సిన్హా ఒక గ్లామరస్ సెడక్ట్రెస్‌గా కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె తన డ్యాన్సింగ్ స్కిల్స్, గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టనుంది. "జటాధర" సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో ఆమె ధన పిశాచి క్యారెక్టర్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. “ఈ విజయదశమి కానుకగా.. ధన పిశాచి అక్టోబర్ 1న వస్తుంది, చెడు యొక్క కొత్త రూపాన్ని ఎదుర్కోండి” అని టీమ్ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. సోనాక్షి మెయిన్ హీరోయిన్‌గా చేస్తోంది. భక్తి అంశాలతో కూడిన ఒక స్పిరిచ్యువల్ థ్రిల్లర్‌గా చెబుతున్న "జటాధర" సినిమాను తెలుగు, హిందీ భాషల్లో భారీ రేంజ్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సోనాక్షి ఇంతకుముందు దబాంగ్‌తో సహా చాలా బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లలో యాక్ట్ చేసింది. రజనీకాంత్ "లింగ" సినిమాతో ఆమె సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది, కానీ "జటాధర"నే ఆమెకు మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. మరి ఈ సినిమా సోనాక్షి సిన్హాకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
-
Home
-
Menu