సోషల్ మీడియా యాక్టివిటీ తగ్గించింది

వివాహం తర్వాత శోభిత ధూళిపాళ తను నటించనని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆమె కొత్త సినిమాలు , వెబ్ సిరీస్‌లను మాత్రం ప్రకటించలేదు. పెళ్లికి ముందు శోభిత సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండేది. వారానికి చాలా సార్లు ఫోటోలు, అప్డేట్స్ షేర్ చేసేది. అయితే... పెళ్లయిన తర్వాత ఆమె ఆన్‌లైన్ ఉనికిని గణనీయంగా తగ్గించుకుంది.
గత ఆరు వారాల్లో... శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఐదు పోస్ట్‌లను మాత్రమే షేర్ చేసింది. దీన్నిబట్టి.. సోషల్ మీడియాలో ఆమె మరింత సైలెంట్ గా ఉందని అర్ధమవుతోంది. శోభిత 2024 డిసెంబర్‌లో నటుడు నాగ చైతన్యను పెళ్లాడింది. ఆమె వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు... బహిరంగ అప్‌డేట్‌ల కంటే వ్యక్తిగత క్షణాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల వంట చేస్తూ ఉన్న ఒక చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది శోభిత. అందులో తన భర్త నాగ చైతన్యను ట్యాగ్ చేసి.. ప్రాథమిక “మానవ నైపుణ్యాలు” నేర్చు కుంటున్నానని సరదాగా పేర్కొంది. ఇది వారి సరదా.. తేలికపాటి రొమాన్స్ ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈరోజు.. శోభితా ధూళిపాళ బీచ్‌లో హాయిగా గడుపుతున్న కొత్త చిత్రాలను పంచుకుంది. ఆమె సాంప్రదాయ నీలి రంగు కాటన్ చీరలో, స్లీవ్ లెస్ ఎరుపు రంగు బ్లౌజ్‌తో, వెండి జుంకాలు, చిన్న బొట్టుతో అద్భుతంగా కనిపించింది. శోభిత త్వరలో ఏవైనా కొత్త తెలుగు సినిమాలకు సంతకం చేస్తుందా? అని అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu