ప్రేమను పెళ్లిగా మలిచిన జంట !

తెలుగు సినిమా లో ఇప్పటికి హాట్ టాపిక్‌గా మారిన జంట నాగచైతన్య, శోభిత ధూళిపాళ. రెండు సంవత్సరాల ప్రేమ అనంతరం 2024 డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం అనంతరం తొలిసారిగా ‘వోగ్ ఇండియా’ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ జంట తమ ప్రేమ ప్రయాణం, జీవన విధానం గురించి ముచ్చటించారు. తాము పరస్పరం పూర్తిగా భిన్నమైన వ్యక్తులే అయినప్పటికీ, ప్రేమ సహజంగానే వచ్చింది అని శోభిత వెల్లడించారు.
మరియు పెళ్లి తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న మార్పులను వివరిస్తూ, “కుటుంబంతో కలిసి భోజనం చేయడం, ప్రశాంతంగా గడిపే నిమిషాలు, మన భాషలో మాట్లాడటం ఈ చిన్న చిన్న ఆనందాలు మరింత విలువైనవని పెళ్లి తర్వాత నిజంగా గ్రహించాం” అని నాగచైతన్య తెలిపారు. “మొదటి నాలుగు నుంచి ఐదు నెలల పాటు వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉంటాం. అయితే, వీలైనప్పుడల్లా కలిసి ప్రయాణాలు చేయడం లేదా విశ్రాంతి తీసుకోవడానికి కాస్త సమయం కేటాయించుకోవడం మాకు ఎంతో ముఖ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో, నాగచైతన్య తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు. ఈ జంటను అభిమానులు ప్రేమగా ఆహ్వానిస్తుండగా, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణానికి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu