దుల్కర్ సినిమాలో శ్రుతి హాసన్?

‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ లాంటి సూపర్ హిట్స్ తర్వాత.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ఫ్యాన్స్‌ని ఫుల్ ఫిదా చేసేశాడు. తెలుగు సినిమాల్లో అతని స్వాగ్‌కి జనం ఫ్లాట్ అవుతున్నారు. ఇప్పుడు దుల్కర్ 'ఆకాశంలో ఒక తార' అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే కొత్త డైరెక్టర్ రవి నేలకుదిటితో ‘డీక్యూ41'లో కూడా నటిస్తున్నాడు.
ఇప్పుడు 'ఆకాశంలో ఒక తార' గురించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. పవన్ సాధినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాదు, 'కూలీ' స్టార్ శ్రుతి హాసన్ కూడా కీలక రోల్‌లో జోష్ ఇవ్వనుంది. శ్రుతి ఎంట్రీతో ఈ సినిమాకి ఎక్స్‌ట్రా హైప్ వచ్చేసింది. టీమ్ ఈ ప్రాజెక్ట్‌పై సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉంది.
దుల్కర్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో సినిమా గ్లింప్స్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ లాంటి బడా ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్, ఇతర డీట్స్ త్వరలో రివీల్ చేస్తారు.
-
Home
-
Menu