తదుపరి చిత్రం షూటింగ్ మొదలు పెట్టిన శోభిత ధూళిపాళ

ప్రముఖ నటి, అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో చిత్రీకరణలో పాల్గొంటోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. ఇది ఆమె వివాహం తర్వాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం.
చిత్రీకరణ బృందానికి చెందిన ఒక వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. శోభిత ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉంది. ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె కొత్త సినిమా ఏంటన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ముందుండే వ్యక్తి. ఈ సినిమా కూడా అలాంటి ప్రత్యేకమైనదే అని తెలుస్తోంది.
షూటింగ్ సమయంలో శోభిత ధూళిపాళ నలుపు, గోధుమ రంగుల వస్త్రాలతో కనిపించింది. హిందీ, తెలుగు సినిమాలతో పాటు.. 'మేడ్ ఇన్ హెవెన్' , 'ద నైట్ మేనేజర్' వెబ్ సిరీస్ లు కూడా ఆమె లైనప్‌లో ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 4న టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంప్రదాయ వివాహం కుటుంబ సభ్యులు, అతి సమీప స్నేహితుల సమక్షంలో అందంగా జరిగింది. పెళ్ళయిన తర్వాత ఆమె టేకప్ చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
-
Home
-
Menu