సంక్రాంతికి 'శతమానంభవతి' మరో కొత్త ప్రయాణం!

సంక్రాంతికి శతమానంభవతి మరో కొత్త ప్రయాణం!
X

శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన 'శతమానంభవతి' మంచి విజయాన్ని సాధించింది. పిల్లలు ఉద్యోగాలు పేరుతో విదేశాలకు వెళ్లిపోవడం.. ఆ తర్వాత తల్లిదండ్రులు ఒంటరి అయిపోవడం అనే కాన్సెప్ట్ తో ఉద్వేగభరితంగా సాగే కథాంశంతో ఈ సినిమా వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

సూపర్ హిట్ మూవీ 'శతమానంభవతి'కి సీక్వెల్ తీయాలని చాలా కాలంగా కసరత్తులు జరుగుతున్నాయి. సీక్వెల్ టైటిల్ ను 'శతమానంభవతి నెక్స్ట్ పేజీ' అంటూ అనౌన్స్ చేశారు. ఒరిజినల్ ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న కాకుండా సీక్వెల్ ను మరో దర్శకుడికి అప్పగిస్తున్నాడట స్టార్ ప్రొడ్యూసర్.

అలాగే హీరోగానూ శర్వానంద్ స్థానంలో ఆశిష్ ను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటోన్న 'శతమానంభవతి' సీక్వెల్ 'శతమానంభవతి నెక్స్ట్ పేజీ'ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.

Tags

Next Story