ఆర్ధిక ఇబ్బందుల్లో శర్వానంద్ సినిమాలు

ఆర్ధిక ఇబ్బందుల్లో శర్వానంద్ సినిమాలు
X

యంగ్‌ హీరో శర్వానంద్‌ నటన పరంగా మంచి నైపుణ్యం ఉన్న నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇటీవల అతని సినిమాలు ఏదీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. దీని ప్రభావం అతని మార్కెట్‌పై తీవ్రంగా పడింది. థియేట్రికల్‌ మరియు నాన్‌థియేట్రికల్‌ బిజినెస్‌లలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. అయినా కూడా శర్వానంద్‌ మాత్రం డబుల్ డిజిట్ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తుండటం పట్ల నిర్మాతల్లో అసహనం వ్యక్తమవుతోంది.

ఇటీవలే శర్వానంద్‌ రెండు కొత్త సినిమాలకు సంతకం చేశాడు. రామ్ అబ్బురాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "నారి నారి నడుమ మురారి", అలాగే అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న శర్వా 36 సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, రెండు ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవడమే. శర్వానంద్‌ మార్కెట్‌ పతనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం.

ఇక తాజాగా శర్వానంద్‌ సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్‌ "భోగి" అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా రెండు షెడ్యూల్లు పూర్తయిన తర్వాత షూటింగ్‌కు బ్రేక్ పడింది. నిర్మాత కె.కె. రాధా మోహన్‌ గతంలో చేసిన "భైరవం" సినిమాతో భారీ నష్టం చవిచూశారు. దీంతో ఆయన ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. అయితే శర్వానంద్‌ మళ్లీ సెట్స్‌కి రావాలంటే ముందుగా అడ్వాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నాడట. అందువల్ల జూన్ నుంచి "భోగి" షూటింగ్‌ నిలిచిపోయింది. నిర్మాత అడ్వాన్స్‌ ఏర్పాటు చేయలేకపోవడంతో శర్వానంద్‌ షూటింగ్‌కి హాజరుకాలేదు.

ప్రస్తుతం శర్వానంద్‌కి సంబంధించిన ఈ మూడు సినిమాలు — "నారి నారి నడుమ మురారి", శర్వా 36, "భోగి"... అన్నీ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాయి. మంచి నటుడిగా గుర్తింపు ఉన్నప్పటికీ, మార్కెట్‌ పరిస్థితులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

Tags

Next Story