స్టైలిష్ మేకోవర్ తో శర్వానంద్

స్టైలిష్ మేకోవర్ తో శర్వానంద్
X
ఈ రోజు చిత్ర బృందం కొత్త స్టిల్స్‌ను విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ట్రెండీ, క్లాసీ లుక్‌తో అతను హ్యాండ్సమ్ గా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.

శర్వానంద్ తన రాబోయే సినిమాలో టాలెంటెడ్ మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో శర్వానంద్, అతని టీమ్‌తో కూడిన కీలక రేసింగ్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ రోజు చిత్ర బృందం కొత్త స్టిల్స్‌ను విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ట్రెండీ, క్లాసీ లుక్‌తో అతను హ్యాండ్సమ్ గా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రల్లో ఒకదాన్ని పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వంశీ అండ్ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకు సిద్ధమవుతోంది. కొంత కాలంగా సరైన హిట్స్ లేని శర్వానంద్ ... ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ చిత్రానికి ‘రేసర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Tags

Next Story