శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్?

శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్?
X
మొదట్లో.. యంగ్ హీరో నితిన్ ఈ సినిమాలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇప్పుడు మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్ వద్దకు చేరింది.

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల. ఇప్పుడు ఒక పకడ్బందీ స్క్రిప్ట్‌తో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. మొదట్లో.. యంగ్ హీరో నితిన్ ఈ సినిమాలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇప్పుడు మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్ వద్దకు చేరింది.

ఈ సినిమా గురించి వచ్చే వారం అధికారిక ప్రకటన రానుంది. సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం మొదట్లో ప్రారంభం కానుంది. దర్శకుడు శ్రీను వైట్ల చెప్పిన కథనం శర్వానంద్‌కు బాగా నచ్చడంతో, ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్‌కి అంగీకారం తెలిపారు.

ప్రస్తుతం శ్రీను వైట్ల, అతని టీమ్ సినిమాలోని ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రానికి యువ రచయిత నందు కథ, స్ర్కీన్ ప్లే ను అందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ భారీ కమ్‌బ్యాక్ మూవీకి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags

Next Story