శర్వానంద్ చిత్రానికి వెరైటీ టైటిల్ !

శర్వానంద్ చిత్రానికి వెరైటీ టైటిల్ !
X
1960వ దశకంలో ఉత్తర తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రం ఒక అద్భుతమైన, ఆకర్షణీయమైన, గ్రాండ్ కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, యాక్షన్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు “భోగి” అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్ . ఈ చిత్రాన్ని కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా “భోగి” సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

1960వ దశకంలో ఉత్తర తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రం ఒక అద్భుతమైన, ఆకర్షణీయమైన, గ్రాండ్ కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా గురించి ఆసక్తి రేకెత్తించేలా ఒక గ్లింప్స్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తన పాత్రకు తగ్గట్టుగా పూర్తిగా మేకోవర్ అయ్యాడు. తన శరీర ఆకృతిని, నటనా శైలిని ఈ పాత్రకు సరిపడేలా మార్చుకున్నాడు. ఈ మార్పు అతని అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనుందని అంటున్నారు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సాంకేతికంగా అత్యుత్తమ బృందం పనిచేస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది. దీని కోసం హైదరాబాద్‌లో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్‌ను రూపొందించడానికి ఒక ప్రత్యేక బృందం ఆరు నెలల పాటు కష్టపడి పనిచేసింది. 1960ల నాటి ఉత్తర తెలంగాణ వాతావరణాన్ని, జీవన శైలిని సజీవంగా ఆవిష్కరించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దారు. “భోగి” సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.



Tags

Next Story