షార్ప్ రన్ టైమ్ తో ‘దిల్ రూబా‘

షార్ప్ రన్ టైమ్ తో ‘దిల్ రూబా‘
X

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం‘. ‘క‘ మూవీతో రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరిన కిరణ్.. ఇప్పుడు ‘దిల్ రూబా‘తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. హోలీ కానుకగా మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ‘యు/ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీ 2 గంటల 20 నిమిషాల డీసెంట్ రన్ టైమ్ తో రాబోతుంది. ఇక.. విడుదలకు ముందే రేపు (మార్చి 13) ఈ సినిమాకోసం ప్రీమియర్స్ వేయబోతున్నారు. దాదాపు 20 థియేటర్లలో ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారట. మొత్తంగా.. ‘దిల్ రూబా‘ కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందేమో చూడాలి

Tags

Next Story