సీక్వెల్ సన్నాహాల్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆచార్య’

సీక్వెల్ సన్నాహాల్లో  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆచార్య’
X
ఇప్పుడు “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” కి సీక్వెల్ రూపొందుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” తో మంచి స్టార్‌డమ్‌ వచ్చిపడింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కిక్ ఇచ్చే కామిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో నవీన్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఆ సినిమా విడుదల తర్వాత అతడు వెనక్కి తిరిగి చూడలేదు. వరుస హిట్లతో ఫుల్ డిమాండ్‌లో ఉన్నాడు.

ఇప్పుడు “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” కి సీక్వెల్ రూపొందుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సీక్వెల్‌కి సంబంధించి బేసిక్ ఐడియా నచ్చడంతో నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన స్వరూప్ ఆర్‌ఎస్‌జేనే సీక్వెల్‌కి కూడా డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. రాహుల్ యాదవ్ నక్కా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 2” ను నిర్మించనున్నారు.

ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు” అనే కామెడీ ఎంటర్‌టైనర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి 2026 కి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే నవీన్ డిస్కషన్ లో మరో రెండు స్క్రిప్ట్‌లు కూడా ఉన్నాయని సమాచారం. మరి ఈ సారి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆచార్య’ ఎలాంటి కేసు ను సాల్వ్ చేయబోతాడో చూడాలి.

Tags

Next Story