రీఎంట్రీ అస్సలు వర్కవుట్ అవలేదు!

సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటీమణులు పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు విరామం తీసుకుని, ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ఈ ఏడాది, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముగ్గురు నటీమణులు తమ కమ్‌బ్యాక్‌తో సందడి చేశారు, కానీ వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
‘మన్మథుడు’, ‘రాఘవేంద్ర’ వంటి సినిమాలతో పాపులర్ అయిన అందాల నటీమణి అన్షు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘మజాకా’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది రిలీజైనా, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
2000 లలో తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన హీరోయిన్ లయ. ఇటీవల నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమాతో తిరిగి వెండితెరపై కనిపించింది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించినా, అంచనాలను అందుకోలేక, థియేటర్లలో ఘోరంగా విఫలమైంది.
ఇంక 2000లలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుస విజయాలతో రాణించిన హీరోయిన్ జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. 13 ఏళ్ల విరామం తర్వాత ‘జూనియర్’ సినిమాతో తిరిగి టాలీవుడ్ లో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల రిలీజైన ఈ సినిమా, పాతబడిన కథ, ఆసక్తిరహిత స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్ ఎదుర్కొంది. దీంతో జెనీలియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కమ్‌బ్యాక్ కూడా నిరాశతో ముగిసింది. మొత్తానికి 2025లో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటీమణులకు అస్సలు కలిసిరాలేదన్నమాట.
-
Home
-
Menu