అప్పుడే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయిందా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లోని 'విశ్వంభర' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక.. ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తాగా పూర్తయినట్టు సమాచారం. ఏప్రిల్ మొదటివారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో చిరంజీవితో పాటు ఓ సీనియర్ నటి కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారని టాక్.
రీసెంట్ గా జరిగిన ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి స్వయంగా తాను అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనిల్ చెప్పిన సన్నివేశాలు విని కడుపుబ్బా నవ్వానని, గతంలో దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన ఫీలింగ్ ఇప్పుడు అనిల్‌తో ఉంది అని చిరు వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించనుండగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనిల్ రావిపూడి గత చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఈ మూవీ ఉండనుందని, ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన వెంకటేశ్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని సాధించింది. రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. అదే సమయంలో అనిల్ రావిపూడి తాను చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోంది.
-
Home
-
Menu