శివ పాత్ర నన్ను బాగా కదిలించింది : సత్యదేవ్

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తాజాగా విడుదలైన గ్యాంగ్‌స్టర్ డ్రామా “కింగ్‌డమ్” సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఇద్దరు సోదరుల మధ్య భావోద్వేగ బంధాన్ని చూపిస్తూ, ఆకట్టుకునే కథనం, లోతైన ఎమోషన్స్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. సత్యదేవ్ ఈ చిత్రంలో “శివ” పాత్రలో నటించాడు, ఈ క్యారెక్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ లభించింది.
సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి సత్యదేవ్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఇంతమంది నుంచి కాల్స్, మెసేజ్‌లు రాలేదు. మొదటి షో నుంచే ప్రేక్షకుల లవ్ నాన్‌స్టాప్‌గా వస్తోంది. గౌతమ్ కథ చెప్పినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.. వెంటనే ఓకే చెప్పేశాను. శివ పాత్ర నన్ను బాగా కదిలించింది” అని చెప్పాడు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ పాత్ర సత్యదేవ్‌ని దృష్టిలో పెట్టుకునే రాశారు. “గౌతమ్ తర్వాత చెప్పాడు.. ‘శివ పాత్రకి నువ్వే నా ఫస్ట్ ఛాయిస్’ అని. కొన్ని ఆలస్యాల వల్ల టీమ్ వేరే ఆప్షన్స్ చూసినా.. చివరికి ఈ రోల్ నాకు దక్కడం డెస్టినీ అనిపించింది” అని గుర్తు చేసుకున్నాడు. గతంలో తన హిట్ సినిమాలతో పోలిస్తే, “కింగ్‌డమ్” స్కేల్, విజయ్ ఫ్యాన్‌బేస్ కారణంగా తక్షణమే భారీ రీచ్ సాధించిందని సత్యదేవ్ చెప్పాడు.
సినిమాలో బోట్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ.. “నాకు బోట్ నడపడం అసలు రాదు. విజయ్ నన్ను పూర్తిగా నమ్మాడు. కొన్ని సార్లు దగ్గర్లో మిస్ అయ్యాం. కానీ.. తీవ్రమైన ప్రాక్టీస్ తర్వాత సీన్ పర్ఫెక్ట్‌గా వచ్చింది..” అని నవ్వుతూ చెప్పాడు.
విజయ్ దేవరకొండ గురించి సత్యదేవ్ ప్రశంసలు కురిపించాడు. “సినిమాకి ముందు విజయ్‌తో నాకు పరిచయం లేదు. షూటింగ్ సమయంలో అతన్ని బాగా తెలుసుకున్నాను. చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్లీగా ఉంటాడు. అతని టాలెంట్ అయితే అద్భుతం.. విషయాలను త్వరగా గ్రహించే సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయాను..” అని అన్నాడు.
రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి చెప్తూ, సత్యదేవ్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు. అతని వెబ్ సిరీస్ “అరేబియన్ కడలి” ఆగస్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే, “ఫుల్ బాటిల్” సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. దర్శకుడు వెంకటేష్ మహాతో కూడా కొత్త ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాడు.
-
Home
-
Menu