సప్తగిరి పెళ్లి ప్రయాణం – ఫన్ అన్‌లిమిటెడ్!

సప్తగిరి పెళ్లి ప్రయాణం – ఫన్ అన్‌లిమిటెడ్!
X

సప్తగిరి పెళ్లి ప్రయాణం – ఫన్ అన్‌లిమిటెడ్!కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'పెళ్లి కాని ప్రసాద్'. వెంకటేష్ సూపర్ హిట్ మూవీ ‘మల్లీశ్వరి‘లోని పెళ్లి కాని ప్రసాద్ క్యారెక్టర్ టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టారు. ‘మళ్లీశ్వరి‘ తర్వాత తెలుగు లోగిళ్లలో పెళ్లికాని మగవాళ్లను పెళ్లి కాని ప్రసాద్ లు అనడం కామన్ గా మారిపోయింది.


లేటెస్ట్ గా సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్' మూవీ టీజర్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. ఇంతకీ ప్రభాస్ కూడా ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదే. ఇక టీజర్ విషయానికొస్తే.. ప్రారంభంలోనే 'ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను గౌరవిస్తూ మా తాతముత్తాతలు పాటించిన షరతులను కొనసాగిస్తాను' అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్ తోనే ఈ మూవీ స్టోరీపై క్లారిటీ వచ్చేస్తుంది.

పెళ్లి కోసం ఎంతో తాపత్రయ పడే యువకుడిగా సప్తగిరి.. కట్నం కావాలని పట్టుబట్టే అతని తండ్రి మధ్య జరిగిన ఆసక్తికరమైన అంశాలతో టీజర్ వినోదాత్మకంగా ఆకట్టుకుంటుంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ నటించింది. తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ నటించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మార్చి 21న 'పెళ్లి కాని ప్రసాద్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Tags

Next Story