సప్తగిరి కామెడీ సందడి.. ట్రైలర్‌కు హిట్ టాక్!

సప్తగిరి కామెడీ సందడి.. ట్రైలర్‌కు హిట్ టాక్!
X

నటుడు సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన ‘పెళ్లి కాని ప్రసాద్’ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైంది. మార్చి 21న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది.

హీరో ప్రసాద్ (సప్తగిరి) విదేశంలో ఉద్యోగం చేస్తుంటాడు. వయసు పెరిగే కొద్దీ పెళ్లి కోసం ఒత్తిడి కూడా పెరుగుతుంటుంది. అయితే, దీనిని సీరియస్‌గా తీసుకునే బదులుగా అతని తండ్రి “ఏజ్ పెరిగితే వర్క్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది.. ఎక్కువ కట్నం డిమాండ్ చేయొచ్చు” అంటూ బదులిస్తాడు.

ఇక హీరోయిన్ ఫ్యామిలీ మాత్రం పెళ్లి పేరుతో అంతా విదేశాలకు షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ చేస్తుంటుంది. అలా ఈ రెండు విభిన్నంగా ఉన్న కుటుంబాల మధ్య పెళ్లి ఫిక్స్ అవుతుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందనేది సినిమా కథలో ప్రధాన హైలైట్ గా ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. మొత్తంగా ‘పెళ్లి కాని ప్రసాద్’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ ఎస్. వి. సి ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం.

Tags

Next Story