మరో అరుదైన ఘనత సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం‘!

తెలుగు చిత్రసీమలో వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టించిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం‘ ఒకటి. వెంకటేష్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన హ్యాట్రిక్ మూవీ ఇది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం‘ సంక్రాంతి బరిలో విడుదలై బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతుంది.
లేటెస్ట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం‘ మరో అరుదైన ఘనతను సాధించింది. ఒకప్పటిలా 50 రోజులు, 100 రోజులు థియేట్రికల్ రన్ లను గొప్పగా గుర్తించుకోవడం తగ్గిపోయినప్పటికీ, ఈ సినిమా తాజాగా 50 రోజుల మైలురాయిని అధిగమించడం విశేషం. ఏకంగా 92 సెంటర్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం‘ 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషమనే చెప్పొచ్చు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం‘పై అభిమానులు చూపించిన అపారమైన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ ఘనవిజయం మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంకితభావం వల్లే సాధ్యమైంది. సినిమాని ప్రతీ ప్రాంతానికి చేరేందుకు కృషి చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు‘ అని చిత్రబృందం అందరినీ పేరు పేరునా ప్రస్తావించాడు అనిల్.
-
Home
-
Menu