బుల్లిరాజు డిమాండ్ మామూలుగా లేదు !

ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. విజయవంతమైన డైరెక్టర్ గానీ, యాక్టర్ గానీ.. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటే వాళ్ళు ఎంత పారితో షికాన్నైనా డిమాండ్ చేయవచ్చు. ఈ అంశం యువ నటులకు, చిన్నారి కళాకారులకు కూడా వర్తిస్తుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుల్లిరాజుగా నటించిన చిన్నారి కళాకారుడే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.
ఈ చిన్నారి పేరు రేవంత్. ఇతను ఇప్పుడు బుల్లిరాజుగా ఎక్కువగా ప్రసిద్ధి పొందాడు. అనిల్ రావిపూడి-వెంకటేశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో అతని అద్భుతమైన హాస్యనటనా ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రేవంత్‌ను ఇప్పుడు పలువురు దర్శకులు తమ చిత్రాల్లో నటింపజేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ చిన్నారి తన పారితోషికంగా రోజుకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. అతని కామెడీ టైమింగ్ చూసిన నిర్మాతలు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరో వైపు, తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిరంజీవి సినిమా కోసం రేవంత్‌ను మళ్లీ నటింప జేయాలని అనుకుంటున్నాడట. ఈ ప్రతిభావంతమైన చిన్నారి కోసం చిన్న పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు వినికిడి.
ఈ సినిమా కూడా హిట్ అయితే, రేవంత్‌కు మరింత గుర్తింపు లభించనుంది. అప్పుడు అతని కెరీర్‌కి ఆకాశమే హద్దుగా మారొచ్చు. ప్రస్తుతం అతని చేతిలో 20కి పైగా సినిమాల ఆఫర్లు ఉన్నాయని సమాచారం. అయితే, సరైన అవకాశాన్ని ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పటివరకు ఏ సినిమా చేయడానికి కూడా అంగీకరించలేదట.
-
Home
-
Menu