మన సంస్కృతి విలువల్ని కాపాడుతున్న సంయుక్త మీనన్

మన సంస్కృతి విలువల్ని కాపాడుతున్న సంయుక్త మీనన్
X
నటనతో పాటు, భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ సంస్కృతిని కాపాడేందుకు ఆమె ప్రత్యేకంగా కృషి చేస్తోంది.

తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మల్లూ బ్యూటీ సంయుక్త మీనన్ తాజాగా ఆధ్యాత్మికత వైపు మళ్లింది. నటనతో పాటు, భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ సంస్కృతిని కాపాడేందుకు ఆమె ప్రత్యేకంగా కృషి చేస్తోంది. తాజాగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసింది. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా కుంభమేళాలో పాల్గొని, గంగా నదిలో పవిత్ర స్నానం చేసిన ప్రముఖుల జాబితాలో ఆమె కూడా చేరింది.

సంయుక్త తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్ర గంగాస్నానం చేసిన ఫోటోలను పంచుకుంది. నలుపు కుర్తా ధరించి, గంగానదిలో పవిత్ర స్నానం చేసి, సూర్య భగవానునికి ప్రార్థనలు చేసింది. “జీవిత అర్థాన్ని తెలుసుకునేందుకు విస్తృత దృక్పథం అవసరం. మన సంస్కృతి అపారమైన ఆత్మను కలిగి ఉంది. గంగాస్నానం ద్వారా ఆత్మసంతృప్తి పొందిన అనుభూతిని కలిగి ఉన్నాను” అంటూ తన భావాలను వ్యక్తం చేసింది.

ప్రస్తుతం సంయుక్త బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న "అఖండ 2" లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మహా కుంభమేళా 2025 నేపథ్యంలో ప్రయాగరాజ్‌లో జరుగుతోంది. ఇదే కాకుండా.. నిఖిల్ హీరోగా నటిస్తున్న "స్వయంభూ", శర్వానంద్ హీరోగా నటిస్తున్న "నారి నారి నడుమ మురారి", బెల్లండకొండ శ్రీనివాస్ "హైందవ" వంటి చిత్రాలలో కూడా ఆమె నటిస్తోంది.

Tags

Next Story