అప్పట్లో నేను చేసిన పనికి ఇప్పుడు మీరు క్షమించాలి : సమంత

అందాల సమంతా రుత్ ప్రభు ఇప్పుడు నటిగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుంది. ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బ్రాండ్ ప్రచారాల విషయంలో తన బాధ్యతల గురించి ఎంతగా ఆలోచిస్తుందో వివరించింది. గత ఏడాదిలో దాదాపు 15 బ్రాండ్‌లకు ‘నో’ చెప్పిందని.. ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇతరుల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతోనే జరిగిందని చెప్పింది.
"నేను 20 ఏళ్ళ వయసులో పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు, విజయానికి ప్రమాణాలు ఏమిటంటే .. ఎన్ని సినిమాల్లో నటించామో.. ఎన్ని బ్రాండ్లు నా ముఖాన్ని తమ ఉత్పత్తులపై ప్రచారం కోసం కోరుకుంటున్నాయో .. అదే విజయ సూచికగా భావించేవాళ్లం. అప్పట్లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు నన్ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కోరడాన్ని చూసి ఎంతో సంతోషించేదాన్ని," అని చెప్పింది సమంతా.
"కానీ నేడు ఆ ఆలోచన ఎంత తప్పిదమో అర్థమైంది. అప్పటి నిర్ణయాలపై నా మనస్సు లోతుగా ఆలోచించమని నన్ను తప్పనిసరిగా నెట్టింది. ఇప్పుడు నేను అనుసరించేది .. నా విలువలకు అనుగుణంగా ఉన్నదో లేదో అన్నది. అప్పట్లో చేసిన బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు చాలా అర్థం లేని పని అని ఇప్పుడు తెలుస్తోంది. అప్పట్లో ఉన్న అనుభవంతో చేసిన పనికి ఇప్పుడు ఉన్న నన్ను క్షమించాలి. నా యువ అభిమానులకు కూడా చెబుతున్నాను. మీరు దేనికీ అతీతులు కాదు. నేను కూడా అదే భావించాను. కానీ నిజం తెలుసుకోవడానికి కష్టంగా నేర్చుకోవాల్సి వచ్చింది.”
“గత సంవత్సరం కేవలం 15 బ్రాండ్లను తిరస్కరించాను. ఆ డీల్స్ వల్ల కోట్లు కోట్లు పోయాయి. కానీ నేడు ఏ బ్రాండ్‌ను ప్రచారం చేయాలా అనేది నిర్ణయించే ముందు, ముగ్గురు వైద్యులతో ఆ బ్రాండ్‌ను పూర్తిగా వెరిఫై చేయించుకుంటాను. ఆరోగ్యానికి హాని కలిగించే ఏ ఉత్పత్తిని కూడా నేను ప్రోత్సహించలేను.” అని సమంత తెలిపింది.
2022లో సమంతా మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి కొంతకాలం బ్రేక్ తీసుకుంది. అనంతరం ఆమె ‘ఖుషి’ అనే తెలుగు సినిమాతో తిరిగి వచ్చింది. ఇటీవల వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్: హన్ని బన్ని’ వెబ్ సిరీస్‌లో నటించింది. తర్వాత ఆమె నటిస్తున్న తదుపరి ప్రాజెక్ట్ రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 3’. దీనిగురించి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
-
Home
-
Menu