అగ్నికి ఆజ్యం పోసిన సమంత !

అందాల సమంత గురించి గుసగుసలు ఎప్పుడూ కంటిన్యూ అవుతునే ఉంటాయి. ఈసారి తిరుమల ఆలయంలో దర్శనం చేసుకున్న సందర్భంలో ఆమెతో పాటు కనిపించాడు.. దర్శకుడు రాజ్ నిడిమోరు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన జీవితాన్ని సొంత నిబంధనలతో నడిపిస్తోంది. అయితే, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌ల దర్శక ద్వయంలో ఒకరైన రాజ్‌తో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న ఊహాగానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.
ఈ తిరుమల సందర్శన వారి బంధానికి మరో ఆసక్తికర కోణాన్ని జోడించింది. దాంతో ఈ పుకార్లకు సామ్ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. సమంత పీచ్ సిల్క్ కుర్తీ, దుప్పట్టాలో సాదాసీదాగా, ప్రశాంతంగా కనిపించింది. రాజ్ నీలం షర్ట్, తెల్లని పంచె, తన ట్రేడ్‌మార్క్ సన్‌గ్లాస్‌లతో సింపుల్‌గా ఉన్నాడు. వీరిద్దరూ తమ రిలేషన్ పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోయినా.. ఇలా ఒకరితో ఒకరు కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అందులోనూ రాజ్ స్వస్థలం తిరుపతి కావడంతో ఈ విజిట్ కు పెర్సనల్ టచ్ కూడా జతైంది.
టైమ్ కూడా దానికి తగినట్టుగానే ఉంది. సమంత నిర్మాతగా 'శుభం' సినిమాతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. వృత్తిపరంగా ఆమె కొత్త అడుగులు వేస్తుండగా.. వ్యక్తిగత జీవితంలోనూ ఏదో కొత్త బిగినింగ్ షురూ అయిందా? అన్న అభిమానుల ఊహాగానాలు ఊపందుకున్నాయి. పుక్కిటి పుకార్లైనా, నిజమైనా, సమంత తన జీవితాన్ని ఎప్పటిలాగే ఆత్మవిశ్వాసం, ఆకర్షణ, కొంత రహస్యంతో నడిపిస్తోంది. మరి దీనికి సమంత ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
-
Home
-
Menu