సామ్ కొత్త జీవితానికి ‘శుభం’ కార్డ్ ?

ప్రస్తుతం అందాల సమంత రుత్ ప్రభు ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. ఆమె మొదటి నిర్మాణ చిత్రం "శుభం" సినిమా సక్సెస్ఫుల్గా నిలిచినందున సంబ రాలలో మునిగిపోయింది. మంచి రివ్యూలు, మంచి కలెక్షన్లతో ‘శుభం’ హిట్ అవ్వడంతో సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టింది. "మా మొదటి ప్రయత్నాన్ని మీరు చూసినందుకు, భావించినందుకు, ఉత్సవంగా చేసుకున్నందుకు ధన్యవాదాలు! కొత్త కొత్త కథలు ముఖ్యమనే నమ్మ కంతో చేసిన మా మొదటి అడుగు ఇది." అంటూ సమంత తెలిపింది.
ఈ సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. అందులో ఒక హృదయాన్ని తాకే వీడియోలో ఆమె తల్లి సమంత పనిని పొగుడుతూ మాట్లాడింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే, సమంత – రాజ్ నిడిమోరు ఉన్న రెండు ఫొటోలు.
ఒక ఫోటోలో సమంత రాజ్ నిడిమోరుపై వాలుతూ సెల్ఫీ దిగింది. ఇది వారి కెమిస్ట్రీకి సూచనగా మారింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరు "రాజ్ అండ్ డీకే" దర్శక ద్వయంలో ఒకరు. ‘శుభం’ చిత్రానికి క్రియేటివ్ పార్ట్నర్గా కూడా పనిచేశారు. ఇంతకుముందు "ది ఫ్యామిలీ మాన్ 2", "సిటాడెల్: హనీ బన్నీ" వంటి వెబ్ సిరీస్లలో సమంతను దర్శకత్వం వహించిన రాజ్, ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్’ ను నిర్మిస్తున్నారు.
సమంత, నాగ చైతన్య వివాహం నాలుగేళ్ల తరువాత రెండు సంవత్సరాల క్రితం విడాకులతో ముగిసింది. విడాకుల అనంతరం సమంత, రాజ్ నిడిమోరు మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘శుభం’ విజయాన్ని సంతోషంగా జరుపుకుంటున్న సమంత, తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్టు కనిపిస్తోంది.
-
Home
-
Menu