సామ్ తో సెన్సిబుల్ డైరెక్టర్ ?

'ఏ మాయ చేసావే', 'దూకుడు' వంటి హిట్స్‌తో ఒకప్పుడు స్క్రీన్‌ను తన చార్మ్ తో వెలిగించిన అందాల సమంత.. ఇప్పుడు కాస్త శాంతంగా, లోతైన ఆలోచనలతో, అభిమానులు కోరుకునే ఆ ఫీర్స్ ఎనర్జీ నుంచి దూరంగా కనిపించింది. కానీ ఇప్పుడు ఒక కొత్త రూమర్ ఫ్యాన్స్ ను తెగ ఎక్సయిట్ చేసేస్తోంది. టాలీవుడ్ లోపలి వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం, డైరెక్టర్ శేఖర్ కమ్ముల సమంతతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారట.
ఈసారి ఇది సాఫ్ట్ సినిమా కాదు. బలమైన, ఫీమేల్ డ్రివెన్ ఫిల్మ్ అని టాక్. సమంత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కు స్పేస్ ఇచ్చే ఈ ప్రాజెక్ట్.. శేఖర్ కమ్ముల లేయర్డ్ స్టోరీటెల్లింగ్, సోల్‌ఫుల్ క్యారెక్టర్స్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని అంటున్నారు. కమ్ముల తన లీడ్స్‌కు మరపురాని రోల్స్ క్రాఫ్ట్ చేయడంలో మాస్టర్. ఈ రూమర్ నిజమైతే.. సమంత కోసం రాస్తున్న ఈ క్యారెక్టర్ ఎమోషనల్‌గా హెవీ అని చెప్పాలి.
ఫ్యాన్స్ తమ స్టార్ మళ్లీ బ్రైట్‌గా షైన్ చేయడానికి ఎదురుచూస్తున్న ఈ టైంలో.. ఇది హైప్ క్రియేట్ చేయడానికి సరిపోతుంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఈ ఆంటిసిపేషన్ ఈసారి డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ‘ఫ్యామిలీ మేన్ 2, యశోద, సిటాడెల్’ వెబ్ సిరీస్ లో సమంతలోని యాక్షన్ యాంగిల్ ను చూసిన ఫ్యాన్స్.. ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల సినిమాలో కూడా చూడ బోతున్నట్టు టాక్. మరి శేఖర్ సామ్ కోసం ఎలాంటి కథను రాసుకుంటాడో చూడాలి.
-
Home
-
Menu