ఈ సారి రామ్ చరణ్ తో ‘ఊ....’ అంటుందా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఈ మూవీ గురించి ఇప్పటికే బోలెడు బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్ ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్ చుట్టూ మరో హాట్ గాసిప్ ఫైర్‌లా స్ప్రెడ్ అవుతోంది.
అదేంటంటే.. ఈ హై-వోల్టేజ్ డాన్స్ నంబర్‌లో చరణ్‌తో పాటు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్టెప్పులేయనుందని టాక్. ఒకవేళ ఈ ప్లాన్ కార్యరూపం దాల్చితే.. ‘రంగస్థలం’ తర్వాత ఈ క్రేజీ జోడీ మళ్లీ స్క్రీన్‌పై సందడి చేయడం కన్ఫర్మ్. సమంతతో మూవీ టీమ్ ఇప్పటికే చర్చలు స్టార్ట్ చేసినట్లు లీక్ అయిన న్యూస్. త్వరలోనే ఈ డీల్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అభిమానులకు ఫుల్ జోష్ కిక్ గ్యారెంటీ.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా లెజెండరీ ఏ.ఆర్. రహమాన్ వర్క్ చేస్తుండటంతో, సాంగ్స్ రేంజ్ ఏ లెవెల్‌లో ఉంటాయో ఊహించవచ్చు. అంతేకాదు.. ‘పెద్ది’ సినిమా గురించి ఇప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అఫీషియల్ రిలీజ్‌కి ముందే ఈ సినిమా హెడ్‌లైన్స్‌లో ట్రెండ్ అవుతోంది.
-
Home
-
Menu