సామ్.. ఆ పోస్ట్ లైక్ చేసిందేంటి?

టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత ఇటీవల ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల కారణంగా అందరి దృష్టిలోనూ పడిన సంగతి తెలిసిందే. తాజాగా సామ్.. అతనితో కలిసి తిరుపతి, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాల్ని సందర్శించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని కూడా ఊహాగానాలు చెలరేగాయి.
ఇలా సమంత తన డేటింగ్ జీవితంతో వార్తల్లో ఉండగా... ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను లైక్ చేయడం మరింత చర్చనీయాంశమైంది. ఆ పోస్ట్.. ‘పురుషులు తమ భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్ అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టే అవకాశం ఉందని.. కానీ స్త్రీలు తమ పురుష భాగస్వామి అనారోగ్యంతో ఉన్నప్పటికీ వారి పక్కనే ఉంటారని పేర్కొన్నారు.
దీని వల్ల కొందరు... ఆమె తన మాజీ భర్త నాగ చైతన్యపై పరోక్షంగా విమర్శలు చేస్తోందని ఊహించారు. సమంత 2022లో నాగ చైతన్యతో విడాకులు తీసుకుంది. అదే సంవత్సరం, ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇటీవల వరకు ఆమె తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ షేర్ చేసేది. కానీ ఆ టైమ్ లో చైతూ నుంచి ఎలాంటి సానుభూతి మాట కూడా రాలేదు. అందువల్లనే సామ్... ఇలాంటి పోస్ట్ లైక్ చేసిందని నెటిజెన్స్ చెప్పు కుంటున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం నటి శోభితా ధులిపాలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
-
Home
-
Menu