కొత్త ఇన్నింగ్స్ కోసం కృషి చేస్తున్న సమంత

కొత్త ఇన్నింగ్స్ కోసం కృషి చేస్తున్న సమంత
X
ఆమె "సిటాడెల్: హనీ బన్నీ" అనే వెబ్ సిరీస్‌లో స్పై పాత్రలో నటించింది. ఇది గత ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సీజన్ 2 అవసరం లేదని భావించి ప్రాజెక్టును రద్దు చేసింది.

అందాల సమంత తన కొత్త ఇన్నింగ్స్‌లో తిరిగి నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవలే ఆమె తన ప్రొడక్షన్ సంస్థ నుంచి రెండు చిత్రాలను ప్రకటించింది. అందులో ఒకటి "శుభం", త్వరలో విడుదల కానుంది. అయితే.. ఆమె నటనా జీవితంలో మాత్రం పరిస్థితులు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు.

ఇటీవల.. సమంత మరో వెబ్ సిరీస్‌ను కోల్పోయింది. ఆమె "సిటాడెల్: హనీ బన్నీ" అనే వెబ్ సిరీస్‌లో స్పై పాత్రలో నటించింది. ఇది గత ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సీజన్ 2 అవసరం లేదని భావించి ప్రాజెక్టును రద్దు చేసింది. దీంతో సమంత మరో అవకాశం కోల్పోయినట్టైంది.

ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక వెబ్ సిరీస్ "రక్త బ్రహ్మాండ్". దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టాలీవుడ్ లో పవర్ ఫుల్ రీ ఎంట్రీ కోసం సమంత కృషి చేస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఆమెకు సరైన అవకాశం దక్కలేదు. కాబట్టి సమంతను మళ్లీ తెలుగు తెరపై చూడడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశముంది.

Tags

Next Story