రెండు పెద్ద సినిమాల్లో సమంత?

టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత రుత్ ప్రభు గతంలో తన సొంత బ్యానర్ పై మరో సినిమా నిర్మాణం ప్రారంభిస్తానని చెప్పినప్పటికీ.. రెండు నెలల క్రితం ఆ ప్రకటన తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఇటీవల.. ఆమె సినిమా కెరీర్ కంటే దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఉన్న రూమర్డ్ రిలేషన్‌షిప్ వల్లే ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, ఇద్దరు దర్శకులు ఆమెను తమ పెద్ద ప్రాజెక్టుల కోసం పరిశీలిస్తున్నారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో “ఖైదీ 2” కోసం ఒక ఫిమేల్ లీడ్ ను పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. 2019 లో వచ్చిన “ఖైదీ”లో కార్తీ ఒక్కడే లీడ్‌లో ఉండగా... మహిళా పాత్రలు లేవు. కానీ.. సీక్వెల్‌లో ఒక బలమైన ఫీమేల్ రోల్ ఉంటుందని, అందులో సమంత పేరు టాప్ కంటెండర్‌గా వినిపిస్తోంది. అలాగే, దర్శకుడు బుచ్చిబాబు తన “పెద్ది” సినిమాలో సమంతను ఒక స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడని టాక్.
“పుష్ప: ది రైజ్”లోని “ఓ అంటవా మావ” సాంగ్‌తో సంచలనం సృష్టించిన తర్వాత సమంత ఇప్పటివరకు మరో ఐటెం సాంగ్‌లో కనిపించలేదు. అయితే, సమంత ఇంకా “ఖైదీ 2” లేదా “పెద్ది” కోసం అధికారికంగా సైన్ చేయలేదు. గతంలో ఆమెను అల్లు అర్జున్‌తో అట్లీ సినిమాకు లింక్ చేసిన ఊహాగానాలు తప్పని తేలింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి లేదా రెండూ ఆమెకు దక్కుతాయో లేదో చూడాలి.
-
Home
-
Menu