ఫోటోలకు చిక్కకుండా జాగ్రత్త పడుతోందా?

ఫోటోలకు చిక్కకుండా జాగ్రత్త పడుతోందా?
X
సమంతా ఇప్పటికీ రాజ్ నిడమోరుతో కలిసి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఫోటోలకు చిక్కకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం.

టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత ప్రస్తుతం దర్శకుడు రాజ్ నిడమోరుతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ కూడా ఈ వార్తలను బహిరంగంగా ఖండించకపోవడంతో.. ఇది పరోక్షంగా ఆమోదించినట్టే భావిస్తున్నారు. అయినప్పటికీ.. సమంతా ఇప్పటికీ ఆయనతో కలిసి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఫోటోలకు చిక్కకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం.

ఇటీవల తిరుమల ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో రాజ్ నిడమోరుతో కలిసి సమంత కనిపించింది. అయితే ఒక రోజు.. ముంబయి చేరుకున్న సమంతా పక్కనే రాజ్ నిడమోరు ఉన్నా, విమానాశ్రయంలోకి వచ్చిన వెంటనే ఇద్దరూ విడివిడిగా బయటకు వచ్చారు. ముందుగా సమంతా గేట్ ద్వారా బయటకు వచ్చిన కొంతసేపటి తరువాత రాజ్ బయటకు రావడం చూస్తే, ఇంతవరకు ఇద్దరూ కలిసి కెమెరాలకు కనిపించకుండా ఉండాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత సమంతా రాజ్ నిడమోరుతో డేటింగ్ ప్రారంభించినట్టు ప్రచారం. అయితే నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాతే సమంతా మొదటిసారిగా రాజ్ నిడమోరుతో బహిరంగంగా కనిపించడం గమనించవచ్చు. అయితే అప్పుడే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చలు వినిపించాయి.

రాజ్-డీకే ద్వయం లో భాగమైన రాజ్ నిడమోరు.. “ఫ్యామిలీ మాన్ 2”, “సిటాడెల్: హనీ బన్నీ” వంటి వెబ్ డ్రామాలలో సమంతాను ప్రధాన పాత్రలో నటింపజేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రొఫెషనల్ బాండ్ వ్యక్తిగత సంబంధంగా మారిందా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేకపోయినా.. సమయం గడుస్తున్న కొద్దీ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story