‘సామజవరగమన’ సీక్వెల్.. నిజమేనా?

కామెడీ ఎంటర్ టైనర్స్ తో జనానికి మినిమమ్ గ్యారెంటీ వినోదాన్ని అందించే యంగ్ హీరో శ్రీవిష్ణు. తన కెరీర్ లో ఇతడు నటించిన ది బెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయిన మూవీ 'సామజవరగమన’. ఈ కాంబో మళ్లీ టీమప్ అవుతుందని.. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కామెడీ ఎంటర్‌టైనర్ కోసం డిస్కస్‌లలో ఉన్నారని టాక్. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఆల్రెడీ మొదలైందని సమాచారం. రామ్ అబ్బరాజు తాజాగా ‘సామజవరగమన’ సీక్వెల్ స్క్రిప్ట్ నరేట్ చేశాడట.
శ్రీవిష్ణు ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. శ్రీ విష్ణు ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రామ్ అబ్బరాజు, అతని రైటర్స్ టీమ్ భాను, నందు కలిసి ‘సామజవరగమన’ సీక్వెల్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టారని వినికిడి.
రామ్ అబ్బరాజు మొదట శర్వానంద్‌తో 'నారి నారి నడుమ మురారి' పెండింగ్ షూట్ పూర్తి చేస్తాడు. ఈ తర్వాత ‘సామజవరగమన’ సీక్వెల్ మీద పూర్తి ఫోకస్ పెడతాడు. అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. శ్రీ విష్ణు రెండు కొత్త సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. అవి వివిధ ఫేజ్‌ల్లో ఉన్నాయి.
-
Home
-
Menu