దుబాయ్ వీధుల్లో రాజ్ అండ్ సామ్

సమంతా రుత్ ప్రభు ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా స్టార్ట్ చేయలేదు. బ్రేక్ తీసుకుంటూ, ఆమె విదేశాల్లో ట్రావెల్ చేస్తోంది. తరచూ ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్, ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుతో కనిపిస్తోంది. రాజ్ ఆమెతో “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా సమంతా తన రీసెంట్ దుబాయ్ ట్రిప్ నుంచి ఒక వీడియో కొలాజ్ షేర్ చేసింది.
ఈ వీడియోలో ఆమె ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్న మూమెంట్స్, రెస్టారెంట్లలో తిరిగిన సన్నివేశాలు, మాల్స్‌లో షాపింగ్ స్ప్రీలు ఉన్నాయి. వీడియోకి కొంచెం చిలిపి టచ్ జోడిస్తూ, “నీవు చూసేది” వెర్సె్స్ “నేను చూసేది” అనే క్యాప్షన్స్‌తో రెండు పర్స్‌పెక్టివ్‌లను చూపించింది.
ఒక సీన్‌లో ఆమె రాజ్ నిడిమోరుతో చేతులు పట్టుకుని ఉండడం కనిపించింది, దీంతో వాళ్ల రిలేషన్‌షిప్ మరింత కన్ఫర్మ్ అయింది. వర్క్ ఫ్రంట్‌లో, సమంతా త్వరలో నందిని రెడ్డి డైరెక్షన్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనుంది. ఇది వాళ్లిద్దరి రెండో కొలాబరేషన్. ఇంతకు ముందు వచ్చిన “ఓ.. బేబీ” మూవీ సూపర్ సక్సెస్ సాధించింది.
-
Home
-
Menu