ట్విట్టర్‌ను షేక్ చేస్తున్న 'సలార్'!

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. హోంబలే ఫిలింస్ నిర్మించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్’ ఈరోజు మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అభిమానుల నుంచి విశేష ఆదరణను పొందుతుంది. ప్రస్తుతం ట్విట్టర్ లో 'సలార్' రీ రిలీజ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, 'సలార్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడం మా కోసం ఆనందకరమైన విషయం. ఇది పార్ట్ 2 కోసం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది' అని చెప్పారు.
రీ-రిలీజ్ తొలి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ సాధించి, రూ.1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇక ‘సలార్ పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ కోసం ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత 'సలార్' సీక్వెల్‌తో మరింత పవర్‌ఫుల్ యాక్షన్, డ్రామా అందించనున్నాడట.
-
Home
-
Menu