వీరిద్దరి మధ్య రిలేషన్ ఏంటి?

వీరిద్దరి మధ్య రిలేషన్ ఏంటి?
X
ప్రత్యేకంగా, బూర్జ్ ఖలీఫా ముందు వారిద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్ కావడంతో.. వీరి మధ్య ఏమైనా రిలేషన్ డవలప్ అయిందా? అనే ప్రశ్నలు రేకెత్తాయి.

వైష్ణవ్ తేజ్, రీతు వర్మ మధ్య పెరుగుతున్న అనుబంధం గురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా, బూర్జ్ ఖలీఫా ముందు వారిద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్ కావడంతో.. వీరి మధ్య ఏమైనా రిలేషన్ డవలప్ అయిందా? అనే ప్రశ్నలు రేకెత్తాయి. ఈ రూమర్స్ కి మరింత ఊతమిచ్చేలా, రీతు వర్మ తాజాగా షేర్ చేసిన బ్యూటిఫుల్ సన్‌సెట్ ఫొటోకు వైష్ణవ్ తేజ్ లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, ఆ ఫొటోకు లైక్ చేసిన తొలి ఫాలోవర్ అతడే కావడంతో ఫ్యాన్స్ కు మరింత అనుమానాలకు తావిస్తోంది.

వాస్తవానికి, వీరిద్దరూ ఇప్పటివరకు ఏ సినిమాకూ కలిసి పని చేయలేదు. అయితే, రీతు వర్మకు దగ్గరి స్నేహితురాలిగా పేరొందిన నిహారిక కొణిదెల ద్వారానే వైష్ణవ్ తేజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంక రీతు వర్మ ప్రస్తుతం తాజా వెబ్ సిరీస్ విడుదలకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన "మజాకా" సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. మరోవైపు, వైష్ణవ్ తేజ్ ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఇవేవీ రూమర్సేనా, లేక నిజంగానే వీరి మధ్య ఏమన్నా ప్రేమాభిమానాలు ఉన్నాయా? అన్నది త్వరలోనే తెలియాల్సిన విషయం.

Tags

Next Story