‘కింగ్ 100’ చిత్రానికి టైటిల్ ఇదేనా?

కింగ్ నాగార్జున ఇటీవల 'కుబేర', 'కూలీ' చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఆయన తన కెరీర్‌లో 100వ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి 'నితమ్ ఒరు వానం, ఆకాశం' వంటి చిత్రాలతో పేరుపొందిన తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. తాత్కాలికంగా ‘కింగ్100’ అనే వర్కింగ్ టైటిల్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్స్‌లో 'లాటరీ కింగ్' ఒకటిగా పరిశీలనలో ఉంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఈ టైటిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. ఈ బిగ్గీ అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సమాచారం.
నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ప్రత్యేక చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉందని, అంతేకాకుండా నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కూడా అతిథి పాత్రల్లో కనిపించ నున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాకి ‘లాటరీ కింగ్’ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.
-
Home
-
Menu