షూటింగ్ లో జాయిన్ అయిన రుక్మిణి వసంత్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన తాజా బజ్ ఏంటంటే.. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ భారీ చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఆమె ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంది.
రుక్మిణి.. తన అద్భుతమైన అందం, అభినయ ప్రతిభతో ఇప్పటికే కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె సౌత్ ఇండియన్ సినిమాలో బిగ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తోందని చెప్పొచ్చు. ఈ అవకాశం ఆమె కెరీర్‌లో ఒక గేమ్‌ఛేంజర్‌గా నిలవనుంది. ప్రశాంత్ నీల్‌కు తన సినిమాల్లో హీరోయిన్‌లను గ్రాండ్‌గా, స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడంలో ఒక యూనిక్ స్టైల్ ఉంది. అలాంటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్న ఈ సినిమాలో రుక్మిణిని ఆయన ఎలా చూపించబోతున్నాడు అనేది చూడాల్సిన విషయం. ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్‌లో ఉన్నాడు. ఆయన సూపర్ స్లిమ్ లుక్‌లోకి మారిపోయాడట. ఇది ఆయన గత లుక్స్‌కి పూర్తిగా భిన్నమైనది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే బజ్ మొదలైంది. ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను ఈ కొత్త అవతార్‌లో చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu