సౌత్ లో సూపర్ బిజీ అయిపోయింది !

సౌత్ లో సూపర్ బిజీ అయిపోయింది !
X
దక్షిణ భారత భాషల్లో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రుక్మిణి నాలుగు పెద్ద సినిమాలతో బిజీగా ఉంది.

కన్నడ అందాల హీరోయిన్ రుక్మిణి వసంత్ గతంలో చిన్న సినిమాల్లో నటించినప్పటికీ, ‘సప్త సాగరాల దాటి’ సినిమాతోనే ఆమె స్టార్‌డమ్ సంపాదించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో దక్షిణ భారత భాషల్లో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రుక్మిణి నాలుగు పెద్ద సినిమాలతో బిజీగా ఉంది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న పెద్ద చిత్రం ‘మదరాసి’. శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఆ తర్వాత నెల రోజుల్లో, అక్టోబర్ 2న రిషబ్ శెట్టి నటిస్తున్న ‘కాంతార 2’ విడుదలవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

రుక్మిణి ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో కూడా ఆమె ప్రధాన నాయికగా నటిస్తోంది. ఇది ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రం కావడంతో చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదలవుతుంది. అంతేకాదు, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తదుపరి చిత్రంలో రుక్మిణి నాయికగా నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఇవి కాకుండా, రుక్మిణి తమిళం, కన్నడ భాషల్లో మరో నాలుగు సినిమాల గురించి చర్చలు జరుపుతోంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ దక్షిణ భారత సినిమాల్లో అత్యంత బిజీ నటిగా మారింది.

Tags

Next Story