‘ఛాంపియన్‘గా అదరగొడుతున్న రోషన్

X
టాలీవుడ్ వారసుల్లో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఒకడు. ‘పెళ్లి సందడి‘తో హీరోగా హిట్ అందుకున్న రోషన్.. ప్రస్తుతం పలు సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో స్వప్న సినిమాస్ నుంచి వస్తోన్న ‘ఛాంపియన్‘ ఒకటి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని స్వప్న సినిమాస్ తో కలిసి ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈరోజు రోషన్ బర్త్ డే స్పెషల్ గా ‘ఛాంపియన్‘ గ్లింప్స్ రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో స్పోర్ట్స్ మ్యాన్ గా రోషన్ మేకోవర్ బాగుంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. మధి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story
-
Home
-
Menu