రిషభ్ శెట్టి హీరోగా తెలుగు సినిమా?

రిషభ్ శెట్టి హీరోగా తెలుగు సినిమా?
X
ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్‌కు రిషబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, కన్నడ నటుడు రిషబ్ శెట్టి కెరీర్‌ను ఒక్కసారిగా స్టార్‌డమ్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమా విజయం అతని జీవితాన్ని మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హోంబలే ఫిల్మ్స్, కాంతారా ప్రీక్వెల్ అయిన ‘కాంతార 2’ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇది ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సీక్వెల్‌లో రిషబ్ శెట్టి కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా తన మార్క్‌ను చూపించనున్నాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ నుంచి అతను మంచి రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో కూడా సింహభాగం పొందనున్నాడని టాక్.

ఇదిలా ఉంటే.. ‘కాంతార’ విజయం తర్వాత రిషబ్‌కు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇలా అన్ని భాషల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగానే, ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్‌కు రిషబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా రూపొందనుంది. అది కూడా భారీ స్థాయిలో.. బిగ్ బడ్జెట్‌తో. ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నది అశ్విన్ గంగరాజు.

ఎస్‌ఎస్ రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి వద్ద సహాయకుడిగా పనిచేసిన అనుభవజ్ఞుడు అశ్విన్ గంగరాజు. అంతకుముందు అశ్విన్ డైరెక్ట్ చేసిన ‘ఆకాశవాణి’ సినిమా, వాణిజ్యపరంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినా, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా అతనికి ఇండస్ట్రీలో గట్టి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈసారి, అశ్విన్ ఒక ఆసక్తికరమైన కథాంశంతో రిషబ్ శెట్టిని ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ‘కాంతార 2’ విడుదలైన తర్వాతే స్టార్ట్ కానుంది.

Tags

Next Story