రిషబ్ శెట్టి డైరెక్షన్ లో సౌత్ టాప్ హీరో?

కన్నడ టాలెంటెడ్ రిషభ్ శెట్టి ఇప్పుడు దేశంలోనే టాప్ నటుడు-డైరెక్టర్‌లలో ఒకడు. ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్‌ను ముగించేశాడు. అలాగే సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మరో సినిమాలో నటిస్తున్నాడు. అదే టైంలో, హోంబలే ఫిల్మ్స్‌తో ఒక కొత్త ప్రాజెక్ట్ డైరెక్ట్ చేయడానికి టాక్స్‌లో ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం రిషభ్ ఈ బిగ్ బ్యానర్ పై ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ బ్యానర్ అతడిని ప్రభాస్, యష్ లేదా హృతిక్ రోషన్‌లలో ఒకరితో కాంబో సెట్ చేయడానికి ట్రై చేస్తోంది.
ఈ ముగ్గురు స్టార్ హీరోలూ హోంబలేకు డేట్స్ ఇచ్చేశారు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంతకుముందు పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు కూడా వచ్చింది. కానీ అది ఫైనల్ కాలేదు. ఇప్పుడు రిషభ్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ ‘సలార్ 2, స్పిరిట్, కల్కి 2’ తో ఫుల్ బిజీ. యష్ ‘టాక్సిక్’ మీద వర్క్ చేస్తున్నాడు. హృతిక్ ‘వార్ 2’ ప్రమోషన్స్‌లో ఉన్నాడు. రిషభ్ కూడా రెండు ప్రాజెక్ట్‌లతో సూపర్ బిజీ. ఇప్పటివరకూ ఫైనల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ హోంబలే ఫిల్మ్స్ నుంచి త్వరలో అఫీషియల్ అప్‌డేట్ రావొచ్చు.
-
Home
-
Menu