రెజీనా సినిమాల లైనప్ బాగానే ఉంది !

2012 నుంచి తెలుగు సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటిస్తూ వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా కెరీర్ ఇటీవల కొంత స్తబ్దతను ఎదుర్కొంది. ఇప్పుడు ఆమె తన ఫోకస్‌ను మార్చుకుని బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎక్కువ ఆఫర్లను సొంతం చేసుకుంటూ, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కుంటోంది. సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ లో నయనతారతో కలిసి నటిస్తోంది.
అలాగే, మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది వైవ్స్’ మూవీలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. మూడు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా, ఒక పెద్ద తమిళ ప్రాజెక్ట్‌లో కూడా నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి, ఇది ఆమె బిజీ షెడ్యూల్‌కు సంకేతం.
టీవీ షోస్ లోనూ రెజీనా బాగా పాపులర్ అయ్యింది. టాప్ రేటింగ్‌లు సాధించిన తెలుగు డాన్స్ షో ఢీలో జడ్జ్‌గా ఆమె చేసిన పనితనం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. సినిమాలు, టెలివిజన్, హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లతో రెజీనా ముందు ఒక ఉత్కంఠభరితమైన సంవత్సరం ఎదురుచూస్తోంది.
-
Home
-
Menu