రికార్డ్ ప్రైస్ తో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’

రికార్డ్ ప్రైస్ తో  ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’
X
తెలుగు రైట్స్‌ను శ్రీ వేదాక్షర మూవీస్ ధనుష్ కెరీర్‌లోనే రికార్డ్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. నిర్మాత రామారావు చింతపల్లి తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్టర్ ధనుష్ తన కొత్త సినిమా ‘ఇడ్లీ కొట్టు’ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 1న తెలుగు, తమిళం రెండు భాషల్లో రిలీజ్ కానుంది. ఇది ధనుష్ డైరెక్టర్‌గా చేస్తున్న నాలుగో సినిమా. ఆకాష్ బాస్కరన్ నిర్మాణంలో డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై తెరకెక్కిన ఈ సినిమా, ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది.

తెలుగు రైట్స్‌ను శ్రీ వేదాక్షర మూవీస్ ధనుష్ కెరీర్‌లోనే రికార్డ్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. నిర్మాత రామారావు చింతపల్లి తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరుణ్ విజయ్, షాలినీ పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, యాక్షన్ సీన్స్‌ను పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేశారు.

Tags

Next Story