RC16.. శివ రాజ్ కుమార్ లుక్ టెస్ట్ డన్!

RC16.. శివ రాజ్ కుమార్ లుక్ టెస్ట్ డన్!గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘ఉప్పెన‘ ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా ‘RC 16’. ఈ చిత్రంలో కన్నడ సీనియర్ స్టార్ ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శివన్న లుక్ టెస్ట్‌ను పూర్తి చేసిన చిత్రబృందం, త్వరలోనే ఆయన సెట్స్‌లో జాయిన్ అవుతారని ప్రకటించింది.
ఇటీవలే క్యాన్సర్ చికిత్సను పూర్తి చేసుకున్న శివరాజ్ కుమార్ RC16లో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారట. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు.. మ్యాన్లీ స్టార్ జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ఇతర కీ రోల్స్ లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది.
తొలి షెడ్యూల్ ని మైసూర్‌లో ప్రారంభమైన ఈ చిత్రం లేటెస్ట్ గా హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో ఢిల్లీలో కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది టీమ్. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
-
Home
-
Menu